గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “కన్యాకుమారి”. ఈ చిత్రాన్ని రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాతగా దామోదర తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా రిలీజైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా యూట్యూబ్ లో “కన్యాకుమారి” టీజర్ 1 మిలియన్ వ్యూస్ అందుకుంది.
ఇన్ స్టా రీల్స్ లోనూ “కన్యాకుమారి” టీజర్ ట్రెండ్ అవుతోంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ గా “కన్యాకుమారి” సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అనౌన్స్ చేయనున్నారు.