ప్రభాస్ కల్కి సినిమాకు అంతా బజ్ లేదు బజ్ లేదు అన్నారు కానీ తీరా రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్నా కొద్దీ ఈ సినిమా సునామీలా థియేటర్స్ పైకి వస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. హైదరాబాద్ లో గంటకు అరవై వేలకు పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయంటే కల్కి క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ నల్లగండ్లలో ఇటీవల నిర్మించిన అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్ లో రికార్డ్ స్థాయిలో 42 షోస్ వేస్తున్నారు. ఈ అన్ని షోస్ కు టికెట్స్ అమ్ముడవటం విశేషం. ఉదయం 5.30 గంటల నుంచే కల్కి షోస్ బిగిన్ కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లోనూ ఇదే క్రేజ్ కనిపిస్తోంది.