ఆర్జీవీ కోసం ఒంగోలు పోలీసులు వేట..!

Spread the love

పరారీలో రామ్‌గోపాల్ వర్మ..!
ఆర్జీవీ కోసం ఒంగోలు పోలీసులు వేట..!

తాను తీసిన ‘వ్యూహం’ సినిమాతో రామ్‌గోపాల్‌వర్మ చిక్కుల్లో పడిపోయారు. ఆయన వ్యూహానికి ప్రత్యర్థుల నుంచి ప్రతివ్యూహం ఉంటుందని తెలుసుకోలేకపోయినట్టున్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండటం తెలుగురాష్ట్రాల్లో సంచలన వార్తగా నిలిచింది. ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. చంద్రబాబు, లోకేశ్ కుటుంబాలతోపాటు, పవన్‌సహా ఆయన కుటుంబసభ్యులను కించపరుస్తూ అనేక చిత్రాలు తెరకెక్కించారు వర్మ. ఇది కచ్చితంగా వ్యక్తిత్వ హననమేనంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు టీడీపీ నేత కంప్లైంట్ చేశారు. దీంతో ఆర్జీవీపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఏపీ పోలీసులు ఇదివరకే రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు జారీచేశారు. దాని సారాంశం ప్రకారం నవంబర్‌ 19న విచారణకు హాజరుకావాల్సిఉండగా, ఆరోజు ఆర్జీవీ హాజుకాలేదు. దీంతో మరోసారి నోటీసులు అందించారు. దీనిప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు హాజరుకావాల్సి ఉంది. అయితే వర్మ రావడం లేదన్న సమాచారంతో మద్దిపాడు పోలీసులే నేరుగా హైదరాబాద్‌లోని ఆర్జీవీ నివాసం వద్దకు చేరుకోవడంతో అసలు ఆర్జీవీ ఆచూకీనే కానరాకపోవడం కొసమెరుపు. సో, ఈ క్రమంలో ఆర్జీవీ అరెస్ట్ తప్పదంటూ అనేక వార్తలు వెలువడుతున్నాయి. ఉదయం నుంచి హైదరాబాద్‌లోని ఆర్జీవీ నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఆర్జీవీ కోసం ఆయన ఇంటిబయటే పోలీసులు వెయిట్‌ చూస్తూ ఉన్నారు. అయితే సెర్చ్ వారెంట్ లేకపోవడంతో ఆర్జీవీ ఇంట్లోకి పోలీసులు వెళ్లలేని పరిస్థితి.

ఇదిలాఉంటే ఫోన్‌స్విఛాఫ్ చేసిమరీ ఆర్జీవీ పరారీలో ఉండగా…ఆయన సోషల్ మీడియా అంకౌంట్స్‌ హ్యాండిల్స్‌ అన్నీ హైదరాబాద్‌లోనే చూపిస్తుండటంతో నగరంలోనే పాగా వేశారు ప్రకాశం జిల్లా పోలీసులు. వర్మ ఆచూకీ కోసం రెండు బృందాలుగా విడిపోయి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. శంషాబాద్‌, షాద్‌నగర్‌లోని ఫామ్‌హౌజ్‌లపై ప్రధానంగా ఫోకస్ చేశారు. అక్కడే ఓ ప్రముఖ నటుడి ఫామ్‌హౌజ్‌లో వర్మ తలదాచుకున్నట్టు ఊహాగానాలు లేవనెత్తడంతో శివారు ప్రాంతాలే టార్గెట్‌గా వర్మకోసం ఒంగోలు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఏదేమైనా సాయంత్రంలోగా వర్మను అదుపులోకి తీసుకుంటామని ప్రకాశం జిల్లా పోలీసులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...