సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే రవితేజ ఈగిల్ సినిమా అదే డేట్ కు థియేటర్స్ లోకి వస్తోంది. సంక్రాంతి సీజన్ లో చేసుకున్న ఒప్పంద మేరకు తమకు సోలో డేట్ కావాలని ఈగిల్ టీమ్ పట్టుబట్టింది. దీంతో ఊరు పేరు భైరవకోన చిత్ర నిర్మాతలకు ఈ విషయం చెప్పి ఫిలింఛాంబర్ వాళ్లు సర్ది చెప్పారు.
ఛాంబర్ మాట కాదనలేక మరో వారం ఆలస్యంగా ఫిబ్రవరి 16న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఫాంటసీ కథతో దర్శకుడు వీఐ ఆనంద్ ఊరు పేరు భైరవకోన సినిమాను రూపొందించారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ హాస్యమూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఊరు పేరు భైరవకోన తప్పుకోవడంతో రవితేజ ఈగిల్ సినిమా సోలోగా అత్యధిక థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది.