మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. మన దేశపు రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు పొందారు. నిన్న ప్రకటించిన ఈ పురస్కారాల్లో చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డ్ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కళారంగం, సేవారంగంలో చిరంజీవి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందించారు. 2006లో పద్మభూషణ్ అవార్డ్ పొందిన చిరంజీవి ఇప్పుడు పద్మవిభూషణ్ అందుకోవడం ఆయన అభిమానులు, సినీ రంగంలోని స్నేహితుల్లో ఆనందాన్ని నింపుతోంది.
చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్ ద్వారా పాతికేళ్లకు పైగా సేవలు అందిస్తున్నారు చిరంజీవి. ఆయన బ్లడ్, ఐ బ్యాంక్ ద్వారా వేలాది మందికి హెల్ప్ జరిగింది. కరోనా టైమ్ లో ఇండస్ట్రీలోని ఇరవై నాలుగు క్రాఫ్టుల వారికి ఉచిత నిత్యావసరాలు, వైద్య సహాయం అందించారు చిరంజీవి. రాజకీయాల్లో తగిలిన ఎదురుదెబ్బలకు ఇలాంటి అరుదైన గౌరవాలు చాలా ఉపశమనం చిరంజీవికి అందిస్తున్నాయి. తనకు పద్మవిభూషణ్ అవార్డ్ ఇవ్వడం మరింత బాధ్యత పెంచిందన్నారు మెగాస్టార్.