భర్త కాదు.. క్రూరుడు..!
నటిని దారుణంగా హింసించిన ఖాకీ..!
ప్రముఖ పాకిస్తానీ నటి తన భర్త చేతిలో అతి క్రూరంగా హింసించబడింది. ఆస్తిని రాసివ్వలేదన్న కారణంతో అందాల నటి నర్గీస్ ముఖంపై… ఆమె భర్త మాజిద్ బషీర్ పదే పదే తుపాకీ విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో ఆమె ముఖం, కళ్లు, ఆమె శరీరంలోని ఇతర భాగాలు దెబ్బతిన్నాయి. నటి నర్గిస్ భర్త మాజిద్ బషీర్ లాహోర్‌లోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీలో ఇన్‌స్పెక్టర్.
తన భర్త చిత్రహింసలపై ఠాణాలో కంప్లైంట్ చేసిందిన నటి నర్గిస్. గాయపడ్డ ముఖంతో స్టేషన్‌కు వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని వారికి వివరించింది. ఘటన జరిగిన సమయంలో అధికారిక తుపాకీతో తన భర్త మాజిద్ బషీర్ తన ముఖంపై పదే పదే కొట్టాడంటూ వాపోయింది. మరీ ముఖ్యంగా కళ్ల చుట్టూ తీవ్రంగా కొట్టాడని ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. ఈ మేరకు కధనాన్ని పాకిస్తానీ దినపత్రిక డాన్ వెల్లడించింది.
నటి నర్గిస్ వంద చిత్రాల్లోపైగా నటించింది. అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా నర్గిస్‌కు గుర్తింపు ఉంది. తన సోదరిని ఎప్పటినుంచో బషీర్ గృహహింస చేస్తూ వచ్చాడని నర్గీస్ సోదరుడు ఖుర్రం భట్టి పోలీసులకు వెల్లడించాడు.
ఉద్యోగులు, మేనల్లుడు ఎదురుగానే భర్త మాజిద్ బషీర్ తనను అత్యంత దారుణంగా హింసించాడని, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడని, బూతులు తిడుతూ ఎంతగానో అవమానించాడని…చివరకి నోట్లో తుపాకీ దూర్చి తన దవడను తీవ్రంగా గాయపరిచాడని నర్గిస్ తన పడ్డ బాధను పోలీసులకు చెప్పుకుంది.
తాను సంపాదించిన ల్యాండ్, బంగారు ఆభరణాలు, ఇతరత్రా ఆస్తులను లాక్కోవాలనేదే బషీర్ కాంక్ష అని నర్గిస్ అంటోంది. ఈమేరకు తాను గాయపడ్డ గాయలతో సోషల్ మీడియాలో వీడియో క్లిప్ అప్‌లోడ్ చేయగా…ఆమె శరీరంపై గాయాలను చూసి నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బషీర్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన పాకిస్తాన్ వ్యాప్తంగా చర్చకు దారితీసిన వేళ నర్గిస్ భర్త బషీర్ జాడ లేకుండాపోయాడు. ఆమె కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం పరారీలో ఉన్నాడు. ఇప్పుడు అతనికోసం పోలీసుల వేట కొనసాగుతోంది.
మాజీ భార్య, ప్రముఖ టీవీ హోస్ట్‌తో కలిసి ఎప్పటినుంచో తన నుంచి విడిపోదామనుకున్నాడని బాధితురాలు నర్గిస్ కంప్లైంట్‌లో రాసుకొచ్చింది.