ఒకే వేదికపై పవన్, బన్నీ..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్, బన్నీ వర్గాల మధ్య వార్ హాట్‌టాపిక్‌గా మారిన నేపథ్యంలో…వీరిద్దరూ త్వరలోనే ఒకేవేదికపై కనిపించబోతున్నారన్న టాక్ నడుస్తోంది.
బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా…ఇండస్ట్రీకి సంబంధించిన నాలుగు రంగాల పెద్దలు స్వర్ణోత్సవ వేడుక నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవిని రావాల్సిందిగా కోరగా, ఆయన వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పరిశ్రమలోని పలువురు ప్రముఖ నటులను, ప్రభుత్వ పెద్దలనూ కలుస్తూ ఆహ్వానాలు పలుకుతున్నారు. ఈ క్రమంలో నేషనల్ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని కలిశారని…ఆయన ఈ కార్యక్రమానికి వస్తున్నారని ప్రచారం జరుగుతుండగా…మరోవైపు బాలకృష్ణతో కొన్నాళ్లుగా ఏర్పడిన అనుబంధం, ప్రభుత్వంలో మిత్రపక్షంగా జనసేన కీ రోల్ ప్లే చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందిందని, ఆయన కూడా బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు వస్తారని సినీవర్గాలు చెబుతున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే ఎన్నికల వేళ రాజుకున్న మెగా, అల్లు వారింట వార్…సెప్టెంబర్ 1న హైదారాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరిగే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుక వేదికగా ఏం జరగుబోతుందనేది ఉత్కంఠగా మారింది.
చదవండి: ఆడపడుచులకు పవన్ సారె..!
బాలయ్యకు స్వర్ణోత్సవం..!
నందమూరి బాలకృష్ణకు సరిగ్గా 14 ఏళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. నాడు అలా మొదలైన బాలయ్య సినీ ప్రస్థానం 50 వసంతాలు పూర్తిచేసుకుని…నేటికీ కుర్రకారుకు పోటీగా ఎన్నో హిట్ చిత్రాలు ఇస్తూ దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించిన నాలుగు రంగాల ప్రముఖులు బాలయ్యకు స్వర్ణోత్సవ వేడుక చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.