40 ఏళ్ల క్రితం తెలుగు సినిమా హీరో అడవులు కాపాడేవాడు. ఇప్పుడు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇదీ మన సినిమాల పరిస్థితి అంటూ ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ టార్గెట్ గానే పవన్ ఈ వ్యాఖ్యలు చేశాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బెంగళూరు పర్యటనలో ఉన్న పవన్ అక్కడ మాట్లాడుతూ ఒకప్పుడు అడవులను కాపాడితే హీరోగా సినిమాల్లో చూపించేవారని, ఇప్పుడు హీరోలు చెట్లు స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్ పుష్ప సినిమాలో స్మగ్లర్ గా నటించారు. పవన్ వ్యాఖ్యలు అల్లు అర్జున్ కు కౌంటర్ గానే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారం చేశారు అల్లు అర్జున్. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. మెగా కుటుంబం నుంచి ఓ హీరో పవన్ పోటీ చేస్తున్న జనసేన వ్యతిరేక పార్టీకి ప్రచారం చేయడం చర్చనీయాంశం అయ్యింది. అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ కాబోతోంది.