ఎస్ కేఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశ రావు మృతికి పవన్ కల్యాణ్ సంతాపం

Spread the love

టాలీవుడ్ నిర్మాత ఎస్ కేఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశ రావు మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. స్వయంగా ఫోన్ చేసి ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ ఎస్ కేఎన్ కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు పవన్ కల్యాణ్. గాదె సూర్యప్రకాశ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జనసేన పార్టీ తరుపున సంతాప సందేశాన్ని పంపారు. జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో జరిగిన గాదె సూర్య ప్రకాశ రావు గారి అంత్యక్రియల్లో నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు శిరీష్, దర్శక నిర్మాత సాయి రాజేశ్ పాల్గొన్నారు.

గాదె సూర్యప్రకాశ రావు గారి మరణ వార్త తెలియగానే దర్శకులు మారుతి, హరీశ్ శంకర్, నిర్మాత నాగవంశీ తదితరులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. ఎస్ కేఎన్ కు, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని వెల్లడించారు. ఈ బాధాసమయంలో ఎస్ కేఎన్ స్పందిస్తూ – ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న ఒక హీరో. ఇవాళ నా జీవితంలోని హీరోను కోల్పోయాను. నేను నిర్మాతగా చేసిన బేబి సినిమా ఘన విజయాన్ని సాధించడం నాన్న కళ్లారా చూసి ఆనందించారు. నాన్న మృతితో నాకు మాటలు రావడం లేదు. ప్రపంచాన్ని కోల్పోయినట్లు అనిపిస్తోంది. నన్ను ప్రోత్సహించి, అండగా నిలబడి, నడిపించే శక్తి ఇక లేదు. కన్నీళ్లు ఆగడం లేదు. ఈ బాధలో నాకు, నా కుటుంబ సభ్యులకు ఓదార్పు ఇచ్చిన పవన్ కల్యాణ్ గారికి, అల్లు అరవింద్ గారికి, అల్లు శిరీష్, మారుతి ఇతర మిత్రులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా అని పేర్కొన్నారు.

Hot this week

వెంకీ కి సీక్వెల్ చేయాలని ఉంది :శ్రీను వైట్ల

దర్శకుడిగా 25 ఏళ్ల జర్నీ చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఊహించని...

అరియానా, వివియానా ఫస్ట్‌లుక్‌ రిలీజ్ .

అరియానా, వివియానా పుట్టిన రోజు సందర్భంగా పాత్రలని పరిచయం చేసిన ‘కన్నప్ప’...

ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్ 20న.

సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్...

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్.

సౌత్ ఇండియన్ సినిమా ఐకాన్ సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ ని...

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు రిలీజ్.

దిల్ రాజు ప్రెజెంట్స్, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, భీమ్స్ సిసిరోలియో, రమణ...

Topics

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ కు సుకుమార్ ప్రశంసలు.

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా టీజర్...

హైదరాబాద్ నడిబొడ్డున పుష్ప వైల్డ్ ఫైర్ జాతర.

హైదరాబాద్ నడిబొడ్డున పుష్ప వైల్డ్ ఫైర్ జాతరఐకాన్ స్టార్ అల్లు అర్జున్...

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ తో ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా క .

మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని...