పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఓజీ రిలీజ్ డేట్ గురించి నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ ఓ అఫీషియల్ ప్రకటన చేయనుందనే టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 27 పవర్ స్టార్ ఫ్యాన్స్ కు బాగా గుర్తుండే డేట్.
ఎందుకంటే అదే రోజు పవన్ త్రివిక్రమ్ కాంబో బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేది రిలీజైంది. ఇదే రోజున ఓజీ తెరపైకి వస్తుండటం సెంటిమెంట్ గా ఫ్యాన్స్ భావిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఓజీ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సుజీత్. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ చేశారు. పవన్ రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.