పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఏవి ఏప్పుడు కంప్లీట్ అవుతాయి ఏవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇప్పుడున్న లైనప్ లో ఓజీ విషయంలో కాస్త క్లారిటీ ఉంది. ఈ సినిమా మీద పవన్ ఇంట్రెస్ట్ గా ఉండటం, స్పీడ్ గా మూవీ కంప్లీట్ అవడం, ప్రొడ్యూసర్ దానయ్య పట్ల పవన్ సానుకూలంగా ఉండటం వంటివన్నీ ఓజీ సినిమా త్వరగా ఫినిష్ అయ్యేందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ ఓజీ, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే.. ఓజీ, వీరమల్లు చాలా వరకు పూర్తయ్యయి కానీ.. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం షూటింగ్ బాగా పెండింగ్ ఉంది. పవన్ సినిమాలు ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తాయి అంటే.. హరి హర వీరమల్లు కోసం మంగళగిరిలో భారీ సెట్స్ వేస్తున్నారు. అక్కడే షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీని మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
చదవండి: కొరటాల నెక్ట్స్ మూవీ ఎవరితో..?
ఓజీ సినిమాను సమ్మర్ లో విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. దీనిని బట్టి వీరమల్లు మార్చిలో వస్తే.. ఓజీ మేలో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ జనవరికి షూటింగ్ కంప్లీట్ చేయాలనేది ప్లాన్. ఓజీ, వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సరైన టైమ్ చేసి విడుదల చేయనున్నారని సమాచారం. ఇవన్నీ ఇప్పటికున్న షెడ్యూల్స్. పవన్ రాజకీయంగా ఎప్పుడు బిజీగా మారుతారో తెలియదు కాబట్టి వాస్తవంగా ఏ సినిమాకు గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితే నెలకొంది.