పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అప్ కమింగ్ మూవీ హరి హర వీరమల్లు సెట్ లో అడుగుపెట్టబోతున్నారు. ఆగస్టు మూడో వారం నుంచి ఈ సినిమాకు ఆయన డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిఫ్యూటీ సీఎం అయ్యారు పవన్. ఇప్పుడు మంత్రిగా తన బాధ్యతల నిర్వహణలో తలమునకలై ఉన్నారు.
అయితే ఇప్పటికే తను ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. వాటిలో ముందుగా ఉన్న సినిమా హరి హర వీరమల్లు. ఈ భారీ జానపద చిత్రం బ్యాలెన్స్ షూటింగ్ చేయాల్సిఉంది. క్రిష్ తప్పుకున్న నేపథ్యంలో రత్నం కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఆగస్టు మూడో వారం నుంచి పవన్ ఈ సినిమా సెట్ లో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.