పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచి డిఫ్యూటీ సీఎం అయ్యాక ప్రజా సేవ మీదే దృష్టి పెట్టారు. సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. పవర్ స్టార్ మూవీస్ లో కంప్లీట్ అయ్యేందుకు వచ్చిన ప్రాజెక్ట్ ఓజీ. ఈ సినిమాను పవన్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయబోతున్నారు.
పవన్ చిత్రాల్లో మిగిలి ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు కంటే ఫస్ట్ ఓజీ సినిమాకే డేట్స్ ఇవ్వబోతున్నారు పవన్. అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి 15 రోజుల పాటు ఓజీ షూటింగ్ లో పవన్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ ఇచ్చే రెండు వారాల డేట్స్ తో ఓజీ లో ఆయన షూటింగ్ పూర్తవుతుంది.