హీరో రాజ్ తరుణ్‌పై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అతని ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు. త్వరలోనే రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని, అబార్షన్ చేయించాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుకు ఆధారాలుగా ఫోన్ స్క్రీన్ షాట్స్, ఫొటోస్ చూపించింది.
లావణ్య సమర్పించిన ఆధారాల ప్రకారం రాజు తరుణ్ పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 420, 506, 493పై ఈ కేసులు పెట్టారు. మరోవైపు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, లావణ్య ఒకరి మీద మరొకరు కేసులు పెట్టుకున్నారు. మాల్వీ మల్హోత్రాతో పరిచయం ఏర్పడిన తర్వాతే రాజ్ తరుణ్ తనకు దూరంగా ఉంటూ వస్తున్నాడని లావణ్య ఆరోపిస్తోంది.