హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో ట్విస్ట్ ఏర్పడింది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకోకుండా మోసగించాడంటూ అతనిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది లావణ్య అనే యువతి. ఆమె ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడింది. దాంతో ఆమె వ్యవహార శైలిపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాజ్ తరుణ్ పై పెట్టిన కేసుకు ఆధారాలు చూపాలంటూ లావణ్యకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే పోలీసులకు లావణ్య ఫోన్ లో అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది. లావణ్యతో తాను కలిసి ఉన్నట్లు రాజ్ తరుణ్ ఒప్పుకున్నాడు. అయితే ఆమె వ్యవహారాలు నచ్చకే దూరంగా ఉంటున్నట్లు చెప్పాడు. కెరీర్ మొదట్లో తనకు లావణ్య హెల్ప్ చేసిందని రాజ్ తరుణ్ అన్నాడు.