లావణ్య అనే యువతిని పెళ్లి చేసుకుని మోసం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు నమోదైన నేపథ్యంలో ఈ రోజు నార్సింగి పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. లావణ్య గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా రావాల్సిందిగా రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18లోపు తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
రాజ్ తరుణ్ తనతో కొన్నేళ్లుగా కలిసి ఉంటున్నాడని, తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్ తో రాజ్ తరుణ్ సంబంధాలు కొనసాగిస్తున్నాడని, మాల్వీకి దగ్గరై తనను దూరం పెట్టాడని లావణ్య కంప్లైంట్ లో పేర్కొంది. లావణ్య కంప్లైంట్ తో పోలీసులు రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడిపై కేసు నమోదు చేశారు.