మెగా ఫ్యామిలీ వెర్సెస్ అల్లు ఫ్యామిలీగా గత కొంతకాలంగా వార్తలు రావడం.. రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తుండడం తెలిసిందే. అయితే… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఎన్నికల్లో తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అటు రాజకీయాల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఇక అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్.. బన్నీ ట్రోల్ చేయడం.. బన్నీ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ని ట్రోల్ చేయడం జరుగుతుంది. ఇటీవల మారుతినగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన బన్నీ తనకు నచ్చితేనే చేస్తాను.. తనకు నచ్చితే వస్తాను అని చెప్పాడు. అది చిన్న సినిమా మారుతినగర్ సుబ్రమణ్యం గురించి అయినప్పటికీ.. ఇన్ డైరెక్ట్ గా తనకు నచ్చింది కాబట్టే వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసానని మరోసారి చెప్పాడని ప్రచారం జరిగింది.
ఇక అప్పటి నుంచి బన్నీ పై సోషల్ మీడియాలో విమర్శలు రావడం స్టార్ట్ అయ్యింది. తాజాగా జనసేన ఎమ్యెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బన్నీ పై ఫైర్ అయ్యాడు. దీంతో ఈ వివాదం మరింతగా ముదురుతుంది. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. మేటర్ ఏంటంటే.. పుష్ప 2 డిసెంబర్ 6న వస్తుంది. ఈ మూవీకి బజ్ బాగుంది. అయితే.. అదే నెలలో చరణ్ గేమ్ ఛేంజర్ రానుంది. ఈ మూవీకి చెప్పుకోదగ్గట్టుగా బజ్ లేదు. ఒక సాంగ్ రిలీజ్ చేశారు కానీ.. ఆ సాంగ్ మెప్పించలేకపోయింది.
చదవండి: పాత టైటిల్ తో రాజశేఖర్ కొత్త సినిమా.. ?
పైగా ఈ మూవీ డైరెక్టర్ ప్రస్తుతం ఫామ్ లో లేడు. అందుచేత ముందుగా పుష్ప 2 రిలీజ్ అయితే.. ఈ రెండు సినిమాల మధ్య పోలిక వస్తుంది. అదే పుష్ప 2 ఇప్పట్లో రిలీజ్ కాకపోతే గేమ్ ఛేంజర్ కు ప్లస్ అవుతుందనే ఉద్దేశ్యంతో బన్నీ పై మెగా ఫ్యాన్స్, జనసేన నాయకులు కావాలనే విమర్శలు చేస్తూ ఈ వివాదాన్ని మరింతగా పెద్దది చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ కానీ.. పవర్ స్టార్ కానీ.. ఒక్క మాట చెబితే వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది. మరి.. ఏం జరగనుందో.. ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్లనుందో చూడాలి.