ఉత్తమ తమిళ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న పొన్నియన్ సెల్వన్-1… మరో మూడు కేటగిరీల్లో అవార్డులు ఎగరేసుకుపోయింది. బెస్ట్ సినిమాటోగ్రఫీగా ఈ చిత్రానికి పనిచేసిన రవివర్మన్‌ను జాతీయ పురస్కారం వరించగా…బెస్ట్ రీ రికార్డింగ్ కేటగిరీలో ఏఆర్ రెహ్మన్‌కు అవార్డు లభించింది. అలాగే బెస్ట్ సౌండ్ డిజైనర్‌గా ఆనంద్ కృష్ణమూర్తీకి పురస్కారం దక్కింది.
చదవండి: రుణమాఫీ చేసేశాం… రాజీనామాకు సిద్ధమా: సీఎం రేవంత్
లైకా ప్రొడక్షన్ బ్యానర్‌లో భారీ ఎత్తున రూపుదిద్దుకున్న ఈచిత్రం రెండు భాగాలుగా రాగా…మొదటి భాగం 2019 డిసెంబర్‌లో ప్రారంభమై 2021 సెప్టెంబర్‌లో చిత్రీకరణ పూర్తిచేసుకుంది. మనదేశంలోని కొన్ని చారిత్రక ప్రదేశాలతోపాటు థాయ్‌లాండ్‌లో కూడా పొన్నియన్ సెల్వన్-1 షూటింగ్ జరిగింది. 2022 సెప్టెంబర్ ౩౦న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సుమారు 500 కోట్లు రాబట్టింది. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కిచించిన దర్శకుడు మణిరత్నం.
విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, జయరామ్‌లాంటి ప్రధాన తారాగణంతో పురాణ యాక్షన్ డ్రామాగా దీనిని తెరకెక్కించారు. ఇంత చక్కటి కథాంశంతో తీసిన ఈ చిత్రం 4 జాతీయ అవార్డులు అందుకోవడంలో ఆశ్చర్యమే లేదంటున్నారు సినీ విశ్లేషకులు.