తెలుగు, తమిళం, హిందీలో వరుస ఫ్లాప్స్ చూసింది పూజా హెగ్డే. ఆ మధ్య పూజా హెగ్డే నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయితే ఆ చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ జోరు చూపిస్తోంది పూజా హెగ్డే. తమిళం హిందీలో బిజీగా మారుతోంది.
చదవండి: దేవర భారీ సక్సెస్ మీట్ ఎక్కడ..?
కొందరు స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లోకి వెళ్లిపోవడం, సమంత లాంటి నాయికలు అనారోగ్యంతో సినిమాలకు దూరంగా ఉండటం వంటి కారణాలతో పూజాకే మళ్లీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ లో ఓ క్రేజీ మూవీ ఖాతాలో వేసుకుంది. విజయ్ హీరోగా నటిస్తున్న 69వ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. పూజా ఇప్పటికే విజయ్ తో బీస్ట్ అనే సినిమా చేసింది. వీళ్ల కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది.
ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఇది చివరి సినిమాగా ఉంటుందని చెబుతున్నారు. మేకింగ్ పరంగా భారీ స్థాయిలో దళపతి 69 మూవీ ఉండనుంది.