పవన్ రాజకీయ కార్యకలాపాల వల్ల షూటింగ్ ఆగిపోయిన ‘హరి హర వీర మల్లు’ సినిమా తిరిగి స్టార్ట్ అయ్యింది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సినిమా చిత్రీకరణ తిరిగి మొదలుపెట్టారు. అయితే పవన్ ఈ షూటింగ్ లో పాల్గొనడం లేదు. జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్స్ తో భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందిస్తున్నారు. సుమారు 500 మందితో ఈ భారీ వార్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. స్టంట్ సిల్వ యాక్షన్ కొరియోగ్రఫీలో ఈ సీన్స్ రూపొందిస్తున్నారు.
చదవండి: ఆయ్ మూవీ రివ్యూ
పవన్ కల్యాణ్ ఏపీ డిఫ్యూటీ సీఎం అయ్యాక ప్రజాసేవకే ఎక్కువ సమయం కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో హరి హర వీరమల్లు టీమ్ పవన్ మినహా మిగతా బ్యాలెన్స్ షూటింగ్ చేయాలని భావిస్తున్నారు. అలాగే పవన్ నటించే ఓజీ సినిమా కూడా బ్యాలెన్స్ షూటింగ్ చేయడానికి పవన్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన అక్టోబర్ లో ఓజీ మూవీకి డేట్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. కానీ హరి హర వీరమల్లు కోసం మాత్రం పవన్ డేట్స్ ఇంకా కేటాయించలేదట.
క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయిన తర్వాత నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పవన్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ కాబట్టి హరి హర వీరమల్లు పై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.