ఈ సంక్రాంతికి తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. మారుతి దర్శకత్వంలో తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ అనౌన్స్ మెంట్ రేపు ఉదయం వెలువడనుంది. అలాగే ప్రభాస్ డిజిటల్ కటౌట్ ను భీమవరంలో రేపు ఉదయం ఏర్పాటు చేయబోతున్నారు. ఒక స్టార్ హీరో కటౌట్ ను ఇలా డిజిటల్ గా ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైమ్.
భీమవరంలోని వంప కాశీ కోడి పందెం బరి, పెద మేరారం వద్ద ప్రభాస్ భారీ డిజిటల్ కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రభాస్ మారుతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా హారర్ కామెడీ కథతో తెరకెక్కుతోంది.