మంచి మనసే ప్రభాస్ ను బిగ్గెస్ట్ స్టార్ ను చేసిందని అంటారు ఆయన కెరీర్ ను దగ్గరగా చూసేవారు. ప్రభాస్ ఎంత బిగ్ స్టారో ఆయనది అంత హ్యూజ్ హార్ట్. అందుకే అందరికీ డార్లింగ్ అయ్యారు ప్రభాస్. కరోనా టైమ్ కానీ, వరదలు, తుఫాన్ లు ఇలాంటి విపత్తులు ఏది వచ్చినా ప్రభాస్ తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకొస్తుంటారు. భారీగా విరాళాలు ఇస్తుంటారు.
చదవండి: చిక్కుల్లో “ప్రేమమ్” హీరో
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఆస్తినష్టం, ప్రాణనష్టం జరుగుతోంది. తెలుగు స్టార్స్ స్పందిస్తున్నారు తమ వంతుగా ఆర్థిక సాయం చేస్తున్నారు. ప్రభాస్ కూడా డొనేట్ చేస్తారని తెలుసు. అది అందరి కంటే ఎక్కువగా ఉంటుందనీ తెలుసు. ఊహించినట్లే మిగతా స్టార్స్ కోటి రూపాయలు విరాళం ఇస్తే దానికి రెట్టింపు 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు ప్రభాస్. అందుకే ప్రభాస్ బిగ్ స్టార్ విత్ హ్యూజ్ హార్ట్.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ కు కోటి రూపాయలు, తెలంగాణకు కోటి రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రభాస్ డొనేషన్ ఇచ్చారు. ఇటీవల కేరళ వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు.