రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రాబోతోంది. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. అందుకే ఫౌజీ (సైనికుడు) అనే పేరును పెడుతున్నారట. ఇక ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తోంది. ఫౌజీ లాంఛింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపే గ్రాండ్ గా ఈ సినిమాను లాంఛ్ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట. చెన్నైలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేయబోతున్నారు.
చదవండి: సర్ధార్ తో సై అంటున్న రజీషా విజయన్
దర్శకుడు హను రాఘవపూడి ఫౌజీ సినిమాను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 100 ఎకరాల్లో భారీ సెట్ ఒకటి నిర్మిస్తున్నారట. సినిమా మేజర్ పార్ట్ ఈ సెట్ లోనే షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాయికగా మృణాల్ ఠాకూర్ నటిస్తుందనే వార్తలు వచ్చినా ఈ ప్రాజెక్ట్ తాను చేయడం లేదని స్వయంగా మృణాల్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇక త్రిష పేరు గట్టిగా వినిపిస్తోంది.
త్రిష, ప్రభాస్ కలిసి ఇప్పటికే మూడు సినిమాలు వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడులో నటించారు. ఫౌజీ వీరి క్రేజీ కాంబోకు నాలుగో సినిమా కానుంది. ప్రభాస్ భారీ పాన్ ఇండియా లైనప్ కు మరింత క్రేజ్ తెచ్చే మూవీ ఫౌజీ కానుంది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా సగం కంప్లీట్ అయ్యింది. మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.