ప్రభాస్ తనతో వర్క్ చేసే ప్రతి ఒక్కరినీ లవ్ చేస్తారు. ఆయన సినిమాలో పనిచేసే మెయిన్ టీమ్ కు మంచి ఫుడ్ పంపిస్తుంటారు. అలా మాళవిక మోహనన్ కు కూడా ఆ ఫుడ్ టేస్ట్ చూపించారు. ఈ విషయాన్ని తంగలాన్ ప్రెస్ మీట్ లో చెప్పింది మాళవిక మోహనన్. తెలుగులోకి ఒక బ్యాంగ్ లాంటి మూవీతో రావాలని అనుకున్నానని, అది ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో తీరిందని మాళవిక చెప్పింది.
చదవండి: “తంగలాన్” అంటే బంగారం వేట కాదు స్వేచ్ఛ కోసం పోరాటం – హీరో చియాన్ విక్రమ్
మాళవిక మోహనన్ మాట్లాడుతూ – తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది. ఒక బ్యాంగ్ లాంటి సినిమాతో టాలీవుడ్ కు రావాలని వెయిట్ చేస్తూ వచ్చాను. రాజా సాబ్ సినిమాతో నాకు అలాంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన హైదరాబాద్ లోని బెస్ట్ పుడ్ నాకు పంపారు. మా మదర్ చేసిన ఫుడ్ అంత టేస్ట్ గా ఆ ఫుడ్ ఉంది. మారుతి గారు ఫీమేల్ క్యారెక్టర్స్ బాగా డిజైన్ చేస్తారు. తంగలాన్ లో నా క్యారెక్టర్ కు రాజా సాబ్ లో నా క్యారెక్టర్ తో చూస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. అన్నారు.