హను రాఘవపూడి.. విభిన్నమైన కథలు చెప్పాలని తపించే దర్శకుడు. సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన హను ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ చేస్తున్నాడు. ఇటీవల ఈ భారీ, క్రేజీ మూవీ సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే.. ఈ సినిమా స్టోరీ ప్రభాస్ కోసం రాసింది కాదని.. వేరే హీరో కోసం రాసుకుందని వార్తలు వచ్చాయి. హను ముందుగా ఈ స్టోరీ రాసింది ఎవరి కోసం..? అసలు ప్రచారంలో ఉన్న వార్తల్లో ఉన్న అసలు నిజం ఏంటి.?
అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హను రాఘవపూడి తొలి సినిమాతోనే టేస్ట్ ఉన్న డైరెక్టర్.. అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అందాల రాక్షసి తర్వాత నేచురల్ స్టార్ నానితో కృష్ణ గాడి వీర ప్రేమగాథ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఆశించినంత సక్సెస్ కాకపోయినా ఫరవాలేదు అనిపించింది. అయితే.. ఈ మూవీ చేస్తున్న టైమ్ లోనే నాని, హను కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. కానీ.. కుదరలేదు. ఈ మూవీ తర్వాత నితిన్ తో లై, శర్వానంద్ తో పడి పడ లేచే మనసు, దుల్కర్ సల్మాన్ తో సీతారామం సినిమాలు తీశాడు. సీతారామం కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు విమర్శకులు ప్రశంసలు అందుకుంది.
చదవండి: మల్లువుడ్‌లో మంచమెక్కాలా..? కాకరేపుతున్న హేమ రిపోర్ట్
నానితో చేయాలనుకున్న కథ.. వార్ నేపథ్యంలో ఉంటుందని.. డిఫరెంట్ మూవీ అని గతంలో హను రాఘవపూడి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభాస్ తో చేస్తోన్న మూవీ వార్ నేపథ్యంలో సాగే స్టోరీయే కావడంతో నాని కోసం రాసుకున్న కథతో ప్రభాస్ తో మూవీ చేస్తున్నాడని ప్రచారం మొదలైంది. ఇది నిజమే అనుకుంటే.. కాదు అంటున్నారు హను రాఘవపూడి. తన దగ్గర వార్ నేపథ్యంలో కొన్ని కథలు ఉన్నాయని.. నాని కోసం రాసుకున్న కథ ఇది కాదని వేరే ఉందని అంటున్నారు. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి రానుంది. మరి.. ప్రభాస్ కి ఈ మూవీతో ఏ రేంజ్ సక్సెస్ అందిస్తాడో చూడాలి.