ప్రభాస్ కల్కి సినిమా ప్రీ బుకింగ్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యూఎస్ లో ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ సేల్స్ 3 మిలియన్ డాలర్స్ మార్క్ కు రీచ్ అయ్యాయి. బుక్ మై షో యాప్ లో గంటకు 60వేల టికెట్స్ బుక్ అవుతూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది కల్కి. అయితే ఈ హడావుడిలో బుక్ మై షో చేసిన చిన్న మిస్టేక్ తో ప్రభాస్ కల్కి బదులు రాజశేఖర్ కల్కి సినిమాకు నాలుగు షోస్ హైదరాబాద్ కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ లో బుక్ అయ్యాయి.
దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరగగా బుక్ మై షో యాప్ స్పందించింది. ఆ టికెట్స్ ను కల్కి 2898ఎడి సినిమాకే ట్రాన్సఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ ఇష్యూపై హీరో రాజశేఖర్ కూడా రెస్పాండ్ అయ్యాడు. ఈ విషయం తనకు తెలియదని, కల్కి టీమ్ కు బెస్ట్ విశెస్ చెబుతున్నానని పోస్ట్ చేశాడు. ఈ నెల 27న కల్కి 2డీతో పాటు ఐమ్యాక్స్, త్రీడీ వెర్షన్స్ లోనూ రిలీజ్ కాబోతోంది.