స్టార్ హీరో ప్రభాస్ కల్కి హిందీలో బాక్సాఫీస్ వద్ద మరో రికార్డ్ క్రియేట్ చేసింది. అక్కడ 200 కోట్ల వసూళ్లకు రీచ్ అవుతూ స్ట్రైట్ బాలీవుడ్ మూవీస్ ను ఛాలెంజ్ చేస్తోంది కల్కి. ఈ ఇయర్ హయ్యెస్ట్ గ్రాసర్ గా కల్కి నిలుస్తోంది. నార్త్ బెల్ట్ మొత్తం ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బాలీవుడ్ లో వస్తున్న రెస్పాన్స్ తో కల్కి టీమ్ డబుల్ ఖుషీలో ఉంది.
ఈ సినిమాలో అమితాబ్, దీపిక లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉండటం కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్ గా 800 కోట్ల రూపాయల మార్క్ దాటేసింది కల్కి. అమెరికాలో 15 మిలియన్ డాలర్స్ ఫ్లస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు స్టేట్స్ లో 150 కోట్ల రూపాయలకు పైగా కల్కి మూవీ దక్కించుకుంది. ఇదంతా కేవలం 10 రోజుల వసూళ్లే. సెకండ్ వీకెండ్ కు కల్కి ఈజీగా 1000 కోట్ల మార్క్ సులువుగా అందుకునేలా కనిపిస్తోంది.