మారుతి దర్శకత్వంలో స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే సినిమా టైటిల్ ను మార్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రాజా సాబ్ అనే టైటిల్ ను ఖరారు చేశారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ టైటిల్ ను సంక్రాంతికి అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. పాడబడిన ఓ థియేటర్ నేపథ్యంగా ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది.
ప్రభాస్ ఇప్పటిదాకా పలు యాక్షన్ బ్లాక్ బస్టర్స్ మూవీస్ లో నటించారు. కానీ ఫస్ట్ టైమ్ రొమాంటిక్ హారర్ మూవీలో నటిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని టాక్ వినిపిస్తోంది. హారర్ కామెడీస్ ను తెరకెక్కించడం దర్శకుడు మారుతికి మంచి పేరుంది. అయితే ఆయన ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ తో ఈ సబ్జెక్ట్ ను ఎంత గ్రాండ్ గా, ఎంత కొత్తగా తెరకెక్కిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.