రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ రీసెంట్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. 5.5 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. రాజా సాబ్ టైటిల్ లో వింటేజ్ ప్రభాస్ ను పరిచయం చేశారు దర్శకుడు మారుతి. డైనోసార్ డార్లింగ్ గా మారితే ఎలా ఉంటుందో ఈ పోస్టర్ లో చూపించారు.
ఇప్పటిదాకా యాక్షన్ మోడ్ లో ప్రభాస్ ను చూసిన రెబల్ ఫ్యాన్స్…ఈ కొత్త లుక్ తో హ్యాపీగా ఫీలవుతున్నారు. రాజా సాబ్ సినిమాను రొమాంటిక్ హారర్ కథతో దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. రాజా సాబ్ ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరనేది త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.