పవన్‌ను ట్వీట్లతో పట్టిపీడిస్తున్న ప్రకాశ్‌రాజ్..?
కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువని ఎద్దేవా..!
తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చిన వేళ, మరీముఖ్యంగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ చేసిన వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకున్నారు నటుడు ప్రకాశ్‌రాజ్. ఇప్పటికే పవన్ చేసిన తొలిరోజు ప్రసంగం మొదలు సోమవారం సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన సందర్భాన్ని ఉటంకిస్తూ పవన్‌కు అనేక ట్వీట్లు చేశారు. ట్వీట్లు చేయడం కన్నా ఎగతాళి ధోరణి అని చెప్పొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
హిందూ ధర్మం కోసం పవన్ మాట్లాడితే తప్పుపట్టిన ప్రకాశ్‌రాజ్.. పవన్‌కు తమిళ హీరో కార్తీ చెప్పిన క్షమాపణలనూ ట్వీట్ల అంశంలో క్యాష్ చేసుకున్నారు. సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏముంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతెందుకు ఏంటీ ఈ అవతరం? ఎందుకీ అయోమయం ? జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను ఉద్దేశించి ఎగతాళిగా మాట్లాడటంతో హైదరాబాద్ ‘మా’ అసోసియేషన్ వద్ద హైందవ సమాజం నినదించింది. ప్రకాశ్‌రాజ్ సభ్యత్వాన్ని తీసేయండన్నది వారి డిమాండ్. విదేశాల్లో ఉండి ట్వీట్ల రూపంలో రెచ్చగొడుతున్న ప్రకాశ్‌రాజ్‌పై ఇలా ఓవైపు ఆగ్రహజ్వాల రగులుతుంటే…పవన్‌ను ఉద్దేశించి మంగళవారం మరో ట్వీట్ చేయడం మరింత కాక రేపింది.
తాజాగా చేసిన ప్రకాశ్‌రాజ్ ట్వీట్ ఏంటంటే…కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ?…ఇకచాలు..ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అంటూ ఎద్దేవా చేసి మాట్లాడటం పవర్‌స్టార్ అభిమానుల్లో ఆగ్రహజ్వాల తెప్పించింది. ఇప్పటికే పవన్ తిరుమల పర్యటనలో ఉన్నారు. గురువారంతో తన ప్రాయశ్చిత్త దీక్ష ముగియబోతుంది. చూడాలి మరి…ప్రకాశ్‌రాజ్ ట్వీట్లపై మాల విరమణ అనంతరం పవన్ ఏం మాట్లాడుతారో?