ప్రేమమ్ ఫేమ్ మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఓ నటి వేధింపుల కేసు పెట్టింది. దీనిపై ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఆరుగురిలో నివీన్ పాలీని ఏ6గా చేర్చారు. గత నవంబర్ లో ఆడిషన్స్ కోసం దుబాయ్ తీసుకెళ్లి తనను వేధింపులకు గురి చేశారంటూ ఆ నటి కంప్లైంట్ లో పేర్కొంది. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు నివీన్ పాలి. కుట్రతోనే కావాలనే ఈ కేసు తనపై పెట్టించారని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. చట్టపరంగానే ఈ కేసును ఎదుర్కొని, తాను నిర్దోషినని నిరూపించుకుంటానని నవీన్ పాలీ అన్నారు.
చదవండి: వరద బాధితుల అండగా తెలుగు స్టార్స్
నవీన్ పాలీ మాట్లాడుతూ- నటీనటులు బయటకు వెళ్లినప్పుడు ఎంతోమంది సెల్ఫీలు తీసుకుంటారు. అలా ఆ అమ్మాయి కూడా నాతో సెల్ఫీ తీసుకుంది. అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. మేము ఏ ఆడిషన్ దుబాయ్ లో పెట్టలేదు. అలాంటప్పుడు దుబాయ్ తీసుకెళ్లి వేధించినట్లు ఆ అమ్మాయి చెప్పడం అబద్ధం. స్టార్స్ మీద ప్రతి రోజూ ఏదో ఒక ఆరోపణ వస్తుంటుంది. మా కుటుంబాలు ఇలాంటి ఆరోపణల వల్ల ఎంతగా బాధపడతాయో ఊహించండి. గతంలోనూ ఇదే అమ్మాయి నాపై పోలీస్ కేసు పెట్టింది. ఆ కేసులో వాస్తవం లేదని పోలీసులు కేసు కొట్టేశారు. ఇప్పుడీ కేసు కూడా కుట్రపూరితంగా పెట్టిందే. చట్టపరంగా ఎదుర్కొంటా. అని అన్నారు.
అమ్మాయిలపై వేధింపుల నేపథ్యంలో హేమ కమిటీ రిపోర్టులు సంచలనంగా మారాయి. ఈ సందర్భంలోనే నినీన్ పాలీపై వేధింపుల కేసు నమోదు కావడం మలయాళ చిత్ర పరిశ్రమలో మరో సెన్సేషన్ గా మారింది.