ఎలాంటి ముందస్తు అనౌన్స్ మెంట్స్ లేకుండా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది కాజల్ అగర్వాల్ సత్యభామ. ఈ సినిమా ఇవాల్టి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసిన తర్వాత ప్రైమ్ వీడియో అనౌన్స్ మెంట్ చేసింది. సత్యభామ సినిమాను ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించారు దర్శకుడు సుమన్ చిక్కాల.
మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే రాశారు. ఈ నెల 7న థియేటర్స్ లోకి వచ్చింది సత్యభామ. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమా కాబట్టి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సత్యభామలో కాజల్ అగర్వాల్ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి.