ప్రియదర్శి స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే సొంతంగా చిన్న బడ్జెట్ మూవీస్ హీరోగాగా కంటిన్యూ అవుతున్నాడు. ఇటీవల డార్లింగ్ మూవీ చేసినా అది ఆయనకు వర్కవుట్ కాలేదు. ‘సారంగపాణి జాతకం’ అనే మరో సినిమాతో ప్రియదర్శి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
చదవండి: స్పిరిట్ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తున్న ఈ సినిమాలో రూప కొడవయూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 90శాతం సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుందని మేకర్స్ తెలిపారు.