ప్రియమణి, శరణ్య కలిసి నటించిన ‘భామాకలాపం’ వెబ్ సిరీస్ గతంలో ఆహా ఓటీటీలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పడు ఈ సిరీస్ కు సీక్వెల్ ‘భామాకలాపం 2’ సినిమాను రూపొందించారు. అయితే ఈసారి ‘భామాకలాపం 2’ ఓటీటీలో కాకుండా నేరుగా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఆహాలో స్ట్రీమింగ్ చేస్తారు. డ్రీమ్ ఫార్మర్స్, బాపినీడు.బి, సుదీర్ ఈదర నిర్మాణంలో డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి ఈ సిరీస్ ను రూపొందించారు. ఇవాళ ‘భామాకలాపం 2’ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
‘భామాకలాపం 2’లో అనుపమ పాత్రలో ప్రియమణి అమాయక ఇల్లాలుగా కనిపించనుంది. శరణ్యతో కలిసి సాహసంగా ఆమె ఎలా దోపిడీ చేసిందనేది గ్లింప్స్ లో హింట్ ఇచ్చారు. సస్పెన్స్ క్రియేట్ చేసేలా ప్రియమణి, శరణ్య చెప్పిన డైలాగ్స్ తో గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, అనుజ్ గుర్‌వార్, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. త్వరలోనే ‘భామాకలాపం 2’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు.