స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka chopra) షూటింగ్ లో గాయపడింది. ఆమె తన కొత్త సినిమా ది బ్లఫ్ (The bluff) షూటింగ్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పర్ ఫార్మ్ చేస్తున్న ప్రియాంకకు మెడ దగ్గర గాయాలు అయ్యాయి. ఈ ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది ప్రియాంక. నటిగా తన వృత్తిలో ఇలాంటి ప్రమాదాలు సాధారణమేనంటూ పోస్ట్ చేసింది.
ప్రియాంక గెట్ వెల్ సూన్ అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ పంపుతున్నారు. బేవాచ్ (Bay watch), లవ్ అగైన్ (Love again), ఏ కిడ్ లైక్ జేక్ (A kid like jake) వంటి చిత్రాలతో హాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా. ఆమె ఇప్పుడు ది బ్లఫ్ అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమాను రూసో బ్రదర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా సాగనుంది. ఇప్పటిదాకా హాలీవుడ్ మూవీస్ లో ప్రియాంక తన గ్లామర్ తోనే ఆకట్టుకోగా ది బ్లఫ్ మూవీ ఆమెలోని యాక్షన్ పర్ ఫార్మెన్స్ చూపించనుంది.