టాలీవుడ్ ఐకానిక్ క్యారెక్టర్స్ లో ఒకటిగా మిగిలిపోయింది డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సిరీస్ లో రెండు సినిమాలు డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. టిల్లు సినిమా ఎండ్ లో టిల్లు క్యూబ్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పుడీ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ పేరు వినిపిస్తోంది. ఆమె టిల్లు స్క్వేర్ లో చిన్న గెస్ట్ రోల్ లో మెరిసింది.
పబ్ లో హీరోతో మాట్లాడే సీన్ లో కనిపించింది. ఈ క్యారెక్టర్ కు వచ్చిన క్రేజ్ తో టిల్లు క్యూబ్ లో ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అనంతపురానికి చెందిన ప్రియాంక జవాల్కర్ టాక్సీవాలా, ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ఆ తర్వాత ఆమెకు టైమ్ కలిసి రాలేదు. సినిమాలు తగ్గుతూ వచ్చాయి. ఇలాంటి టైమ్ లో టిల్లు క్యూబ్ ప్రియాంకకు క్రేజీ ఆఫర్ అనుకోవచ్చు.