సక్సెస్ పుల్ సినిమాలు చేస్తూ నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్న యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ తన ఛారిటీ కార్యక్రమాలతో కూడా పాపులర్ అవుతున్నారు. డైరెక్టర్స్ అసోసియేషన్ కు పది లక్షలు, ఎన్టీఆర్ అభిమాని గాయపడితే 50 వేలు..ఇలా పలు సందర్భాల్లో సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహాయాలు చేస్తూ పేరు తెచ్చుకున్నారు ఎస్ కేఎన్. తాజాగా పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళకు ఆటో కొనిచ్చి బహుమతిగా అందించారు.
ఏపీలో ఎన్నికల సమయంలో పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళ పవన్ కల్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరిలోని వారికి పార్టీ ఇస్తానని ఓ మహిళ సంతోషంగా యూట్యూబ్ ఛానెల్ తో చెప్పింది. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఎస్ కేఎన్ దృష్టికి వచ్చాయి. ఆయన స్పందించి ఆమె కోరుకున్నట్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలిస్తే మరియమ్మకు తన డబ్బులతో ఆటో కొనిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు పిఠాపురం వెళ్లి మరియమ్మకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు.