డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు లవ్ స్టోరీస్ చేయడంలో మంచి హిస్టరీనే ఉంది. ఆయన రూపొందించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ లవ్ మూవీస్ గా నిలిచాయి. ఆ తర్వాత తమ్ముడు సాయి రామ్ శంకర్ తో 143, కొడుకు ఆకాష్ తో మెహబూబా రూపొందించారు పూరి. మొదట్లో పూరి రూపొందించిన ప్రేమ కథా చిత్రాలకు ఆ తర్వాత ఆయన చేసిన లవ్ స్టోరీస్ కు చాలా తేడా కనిపిస్తూ వచ్చింది.
ఇక ఈ ట్రెండ్ కు తగినట్లు మరో లవ్ స్టోరీ చేయాలని పూరి అనుకుంటున్నారట. కొడుకు ఆకాష్ తోనే ఈ ప్రేమ కథా చిత్రాన్నిచేయబోతున్నాడట పూరి జగన్నాథ్. ప్రయోగాత్మక కథతో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. పూరి ప్రస్తుతం రామ్ తో డబుల్ ఇస్మార్ట్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా మరో రెండు నెలల్లో రిలీజ్ కు రాబోతోంది. మార్చి 8న రిలీజ్ డేట్ గా అనౌన్స్ చేశారు. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరి-ఆకాష్ మూవీ ఉంటుందట.