సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ వాయిదా పడనుందనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయాలని భావించారు. అయితే అనుకున్న టైమ్ కు షెడ్యూల్స్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ ను డిసెంబర్ కు వాయిదా వేయాలని టీమ్ నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకు పలు అంశాలు కారణమని అనుకోవచ్చు.
పుష్ప మొదటి సినిమాకు వచ్చిన అనూహ్య ఆదరణ, నేషనల్ అవార్డ్స్, హ్యూజ్ సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ సినిమాను ఇంకా భారీగా, హై ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేశారు. దీంతో షూటింగ్ డేస్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. టైమ్ ఎక్కువైనా పర్వాలేదు అంచనాలకు తగినట్లు పుష్ప 2 ఉండాలని టీమ్ అంతా భావించి కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరణ జరుపుతోంది. ఈ సినిమాలో జగదీశ్ అనే ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఆత్మహత్య కేసులో నిందితుడిగా జైలులో ఉన్నాడు. అతనిది హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కావడంతో ఆ కాంబినేషన్ సీన్స్ అన్నీ డిస్ట్రబ్ అయ్యి ఇదొక ఆలస్యంగా మారింది. డిసెంబర్ కల్లా కంఫర్ట్ రిలీజ్ కు వెళ్లొచ్చని పుష్ప 2 టీమ్ భావిస్తోంది.