అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ముందుగా ఫిక్స్ చేసుకున్న ఆగస్టు 15నే థియేటర్స్ లోకి వస్తుందంటూ అనౌన్స్ చేశారు. ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్ వాయిదా పడుతుందనే వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. ఈ రూమర్స్ పై స్పందించింది పుష్ప 2 టీమ్.
గతంలో అల్లు అర్జున్ పుష్ప 2 గురించి మాట్లాడిన వీడియో క్లిప్ పోస్ట్ చేస్తూ దాని మీద రిలీజ్ డేట్ ను మెన్షన్ చేసింది. దీంతో రూమర్స్ కు పుష్ప 2 టీమ్ చెక్ పెట్టినట్లయింది. పుష్ప సినిమాకు వచ్చిన సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 మూవీని ఇంకా భారీ మేకింగ్ వ్యాల్యూస్ తో తెరకెక్కిస్తున్నారని, ఇందుకే మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మిస్తోంది.