పుష్ప 2 సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇక మిగిలిన సాంగ్స్ షూటింగ్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయాల్సిఉంటుంది. పుష్ప సినిమాను ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6వ తేదీకి రిలీజ్ డేట్ మార్చారు.
ఇక ఈ డేట్ మరోసారి పోస్ట్ పోన్ చేసే అవకాశం ఇవ్వకుండా టీమ్ వర్క్ చేస్తోంది. పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల అల్లు అర్జున్ అనవసరంగా పొలిటికల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఒక్కటే మైనస్ గా మారింది. ఇది రేపు సినిమా రిలీజ్ టైమ్ లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ లో దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.