హీరో శర్వానంద్ రేస్ రాజాగా మారుతున్నారు. బైక్ రేసర్ గా ఆయన నటిస్తున్న కొత్త సినిమాకు రేస్ రాజా అనే పేరును పెడుతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన రన్ రాజా రన్ ను పోలినట్లే ఈ రేస్ రాజా టైటిల్ ఉండటం విశేషం. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో శర్వానంద్ తన నాలుగో మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉందీ సినిమా. శర్వానంద్ కొత్త సినిమాకు రేస్ రాజా అనే పేరును పరిశీలిస్తున్నారట. బైక్ రేసింగ్ నేపథ్యంగా సాగే సినిమా కాబట్టి రేస్ రాజా అనే టైటిల్ బాగుంటుందని మూవీ టీమ్ భావిస్తున్నారు. శర్వానంద్ నటిస్తున్న 36వ చిత్రమిది. త్వరలో ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. రేస్ రాజా సినిమా బాలీవుడ్ హిట్ మూవీ తరరమ్ పమ్ రీమేక్ అనే వార్తలూ వస్తున్నాయి.