నాని కొత్త సినిమా సరిపోదా శనివారంను వర్షం ఇబ్బందులు పెడుతోంది. ప్రతికూల వాతావరణం ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపిస్తోంది. గురువారం ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. శనివారం నుంచే వర్షాలు మొదలయ్యాయి. నిన్న సక్సెస్ మీట్ కూడా వాతావరణం బాగా లేకున్నా నిర్వహించారు.
ఈ సినిమా వసూళ్లు వర్షాల కారణంగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో థియేటర్స్ కు పెద్దగా ప్రేక్షకులు వెళ్లడం లేదు. దీంతో సరిపోదా శనివారం సినిమాపై ఆ ఎఫెక్ట్ క్లియర్ గా పడింది. సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్ కు తోడు వాతావారణ బాగా లేకపోవడం కూడా బ్యాడ్ అవుతోంది.
చదవండి: వైరల్ అవుతున్న మహేశ్ కొత్త లుక్
గ్రాండ్ గా ఈ సినిమాకు ప్రమోషన్ చేసి రిలీజ్ చేసింది డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. అనుకున్న తేదీకే విడుదలకు తీసుకొచ్చారు. అయితే ఈ అనూహ్య వర్షాలను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. దీంతో శనివారం, ఆదివారం వీకెండ్ అయినా థియేటర్స్ కు జనం పెద్దగా వెళ్లలేదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను రూపొందించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఎస్ జే సూర్య విలన్ గా ఆకట్టుకున్నారు.