పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న సినిమా ‘ప్రణయగోదారి’. డిఫెరెంట్ కంటెంట్ తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. సాయికుమార్ ఈ చిత్రంలో ప్రత్యేక శైలితో కనిపించబోతున్నారు. హాస్య నటుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుంది. సునిల్ రావినూతల ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ- `ప్రణయగోదారి ` గ్లింప్స్ చాలా బాగుంది. కంటెంట్ చూస్తుంటే తప్పనిసరిగా అందరికి నచ్చుతుందనే నమ్మకం కలుగుతుంది. ఈ చిత్రంలో సాయికుమార్ డైలగ్స్ అన్నీ చాలా ఇన్ ట్రెస్టింగా.. పవర్‌ఫుల్‌గా వున్నాయి. చిత్రం ప్రేక్షకుల ఆదరణతో చాలా మంచి సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా యూనిట్‌కు నా అభినందనలు’ అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ -‘రాజ్‌కందుకూరి గారి చేతుల మీదుగా గ్లింప్స్ విడుదల చేయడం ఆనందంగా వుంది. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారిని అలరించే అంశాలున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతిని కలిగించే కథతో వస్తోంది. టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్ లో చిత్రీకరణ చేస్తున్నాం. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు చిత్రంలో కనిపిస్తాయి. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చతుందనే నమ్మకం వుంది. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.