హీరో రాజ్ తరుణ్ ప్రతి సినిమాకో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకుంటాడని, అతనికి చాలా మంది హీరోయిన్స్ తో సంబంధాలు ఉన్నాయని అంటోంది లావణ్య. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఆమె ఇటీవల పోలీస్ కేసు పెట్టింది. ఇప్పుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడింది. రాజ్ తరుణ్ పై తన ఫైట్ కొనసాగుతుందని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ నుంచి తాను డబ్బులేవీ తీసుకోలేదని, అతను తనకు ఏం కొనిచ్చాడో చెప్పాలని లావణ్య డిమాండ్ చేసింది.
హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ కు వందశాతం సంబంధం ఉందని, ఆమె వల్లే తనను వదిలించుకునేందుకు రాజ్ తరుణ్ ప్రయత్నిస్తున్నాడని లావణ్య చెప్పింది. ఈ రోజు లావణ్య ప్రెస్ మీట్ పెట్టింది. లావణ్య మాట్లాడుతూ – నేను, రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాం. ప్రేమ పెళ్లి కాబట్టి రిజిస్టర్ చేసుకోలేదు. కొంతకాలం నుంచి నన్ను దూరం పెట్టడం ప్రారంభించాడు. మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాక నన్ను వదిలించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాడు. రాజ్ తరుణ్ పై నా ఫైట్ కొనసాగుతుంది. అని చెప్పింది.