హీరో రాజ్ తరుణ్, లావణ్య ప్రేమ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మస్తాన్ సాయిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తూ వినియోగిస్తున్నాడనే కారణాలతో మస్తాన్ సాయిని గుంటూరులో అరెస్ట్ చేశారు. లావణ్య మస్తాన్ సాయితో కలిసి ఉంటుందనే ఆరోపణలు చేశాడు రాజ్ తరుణ్. అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నట్లు రాజ్ తరుణ్ తెలిపాడు.
చదవండి: నాగార్జున పుట్టినరోజున ‘మాస్’ రీ రిలీజ్
దాంతో మస్తాన్ సాయి పేరు ప్రచారంలోకి వచ్చింది. లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో మస్తాన్ సాయి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఢిల్లీ వెళ్లి డ్రగ్స్ తెస్తూ ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నాడు మస్తాన్ సాయి. గతంలో వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన కేసులో మస్తాన్ సాయి డ్రగ్స్ వినియోగదారుడిగా పోలీసులకు చిక్కాడు. అప్పుడు నోటీసులు ఇచ్చి వదిలేశారు.