రాజ్ తరుణ్ లేకుండా ఉండలేనంటూ ఆయన ప్రేయసి లావణ్య ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. నిన్న రాత్రి ఆమె సూసైడ్ నోట్ రాసి అడ్వకేట్ కు వాట్సాప్ చేసింది. ఈ మెసేజ్ చూసిన అడ్వకేట్ పోలీసులకు ఫోన్ చేసి వారి సహాయం కోరారు. నార్సింగి పోలీసులు లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకునేలా ఒప్పించారు.
లావణ్య ఆత్మహత్య ప్రయత్నం విషయం మీడియాలో వైరల్ అవుతోంది. రాజ్ తరుణ్ లేకుండా తాను బతకలేనని, అతను మాత్రం తన చావును కోరుకున్నాడని సూసైడ్ లెటర్ లో లావణ్య రాసింది. రాజ్ తల్లిదండ్రులు, మాల్వీ మల్హోత్రా తన చావుకు కారణమని లేఖలో పేర్కొంది. లావణ్య సూసైడ్ అటెంప్ట్ తో రాజ్ తరుణ్ కు మరిన్ని చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి.