ఆర్ఆర్ఆర్ తో ఇండియన్ సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చాడు దర్శకుడు రాజమౌళి. ఆస్కార్ మన భారతీయ సినిమా గొప్పదనం కొలిచే కొలమానం కాదు. అయితే అంతర్జాతీయంగా తెలుగు సినిమా ఇండియన్ సినిమాకు ఆస్కార్ మరింత గుర్తింపు తీసుకొస్తుంది. ఆర్ఆర్ఆర్ తో హాలీవుడ్ లోనూ ఫేమ్ అయ్యారు రాజమౌళి. ఇప్పుడు ఆయనకు ఆయన భార్య రమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అకాడెమీ మెంబర్స్ గా ఈ దంపతులు ఎంపికయ్యారు.
గతేడాది రామ్ చరణ్, ఎన్టీఆర్, సూర్య లకు ఈ గౌరవం దక్కింది. ఈసారి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు తెలుగు నుంచి రాజమౌళి దంపతులు ఆస్కార్ సభ్యులుగా ఎంపికయ్యారు. 487 మంది సభ్యులు ఉండే ఈ కమిటీ వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డ్ దక్కించుకోబోయే సినిమాల సెలక్షన్ లో ఓటు వేస్తారు. బాలీవుడ్ నుంచి షబానా అజ్మీ, రితేష్ సిద్వానీ, రవి వర్మన్ లకు ఆస్కార్ సభ్యులుగా ఎంపికయ్యారు.