గురువారం ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్
ఆరోగ్యంగానే ఉన్నారన్న చెన్నై అపోలో వైద్యులు
సోమవారం అర్థరాత్రి ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. గుండెకు సంబంధించిన ప్రక్రియ విజయవంతంగా జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం నాడు రజనీకాంత్‌ను డిశ్చార్జ్ చేసేస్తామని వైద్యులు తెలిపారు.
సెప్టెంబర్ 30, అర్థరాత్రి తీవ్ర అస్వస్థతతో గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరారు రజనీకాంత్. గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చందని తెలిపిన వైద్యులు…దీనికి చికిత్స అందించామని తెలిపారు. స్టెంట్ ప్రక్రియ విజయవంతంగా కంప్లీంట్ అయిందని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. దీంతో అప్పటివరకూ ఆందోళనలో ఉన్న అభిమానులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: ప్రశాంత్ కిషోర్ పార్టీ అక్టోబర్ 2న ప్రారంభం..
కాగా, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి X వేదికగా రజనీ గురించి స్పందించారు. ఆయన కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ప్రార్థిస్తున్న కోట్లాదిమందిలో తానుకూడా ఒకడినంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు, తమిళనాడు ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్ కూడా రజనీ ఆస్పత్రి చేరికపై స్పందించారు. సోమవారం రాత్రి ఆస్పత్రిలో జాయిన్ అయినప్పటినుంచి, రజనీకాంత్ ఆరోగ్యంపై నిరంతరం అధికారులతో టచ్‌లోనే ఉన్నానని సుబ్రమణియన్ తెలిపారు. రజనీ కోలుకుంటున్నారని, త్వరగానే డిశ్చార్జ్ అవుతారని వెల్లడించారు.
కాగా, రక్తపోటులో హెచ్చతగ్గుల కారణంగా 2020లో రజనీ ఆస్పత్రిలో జాయిన్ అయిన విషయం విదితమే. నాడు ట్రీట్‌మెంట్ అనంతరం వైద్యుల సూచనలతో నెలరోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు.
కాగా, రజనీ నటంచిన 170వ చిత్రం వేట్టయాన్ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండగా…మూవీ ట్రైలర్ అక్టోబర్ 2న, అంటే బుధవారం నాడు రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మలయాళ తార మంజు వారియర్ నటించిన విషయం తెలిసిందే. అలాగే ఫహద్ ఫాజిల్, దగ్గుబాటి రానా, రితికా సింగ్, తుషార విజయన్, అభిరామి వేట్టయాన్‌లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరపరిచిన ‘మనసిలయో’ పాట ఇంటర్‌నెట్‌లో దూసుకెళ్తోంది.