తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారనే విషయం ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. నిన్న రాత్రి ఆయనకు కడుపులో నొప్పిగా ఉండటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో ఆస్పత్రిలో వైద్యులు రజినీకాంత్‌కు చికిత్స అందిస్తున్నారు. రజినీకాంత్‌కు కార్డియాలజిస్టుల పరీక్షలు చేశారు. రజినీకి అనారోగ్యం విషయం మీడియాలోకి రాగానే సోషల్ మీడియాలో గెట్ వెల్ రజినీ అనే పోస్టులు వైరల్ అవుతున్నాయి.
చదవండి: గేమ్ ఛేంజర్ – రిలీజ్ డేట్ మళ్లీ ఛేంజ్
ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరికాసేపట్లో ఆపోలో వైద్యులు రజినీకాంత్ హెల్త్ బులెటిన్ విడుదల చేయబోతున్నారు. కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు రజినీకాంత్. అమెరికా, సింగపూర్ వంటి వివిధ దేశాల్లో చికిత్స తీసుకుంటున్నారు. దసరాకు ఆయన వేట్టయాన్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.